పథకాలు :
సహకార శాఖ యందు తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 లలో నిర్దేశించిన విధులను మాత్రమే నిర్వహించబడును.
శాఖ యొక్క కార్యకలాపాలు :
- తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 లలో నిర్దేశించిన విధులను నిర్వర్తించటం.
- సహకార సంఘములను తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 ల క్రింద రిజిస్టర్ చేయటం.
- అన్ని సహకార సంఘములను ఆడిట్ మరియు ఎన్నికలను నిర్వహించటం
- అన్ని సహకార సంఘములకు (ఫంక్షనల్ రిజిస్ట్రారులకు చెందిన సంఘములతో సహా) ఆడిట్ చేయటం
- సెక్షన్ 51, 52 మరియు 60 లకు లోబడి విచారణ, తనిఖీ మరియు సర్చార్ చేయడం.
- సహకార సంఘములను పరిసమాప్తి ( లిక్విడేషన్ ) చేయడం
- సివిల్ సప్లై/మార్కుఫెడ్/హకా తరపున రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వరి, మొక్కజొన్న మరియు కందులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం
- ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు మరియు ఎరువులను సరఫరా చేయడం
- తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 లలో నిర్దేశించిన ఇతర్ విధులను నిర్వర్తించటం.
.